ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ : ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆమె తనతో పాటు పెంపుడు కుక్కను తీసుకు వెళ్లారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎంపీలు. ఆపై రేణుకా చౌదరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ సీరియస్ గా స్పందించింది. వాళ్లకు బుద్ది లేదన్నారు.
ఆపై తన పెంపుడు కుక్కను తీసుకు రావడంలో తప్పు ఏమీ లేదని చెప్పింది. ఆపై అది మీలాగా కరిచే కుక్క కాదన్నారు రేణుకా చౌదరి. విచిత్రం ఏమిటంటే గతంలో పార్లమెంట్ లో ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావనకు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. కేవలం కరిచే కుక్కలు పార్లమెంట్ లో కొలువు తీరాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేణుకా చౌదరి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తను ఇలాగేనా తోటి ఎంపీలపై కామెంట్స్ చేసేది అంటూ ఫైర్ అయ్యారు.






