ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ సర్కార్ ను ఏకి పారేశారు. కేవలం బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను, నేతలను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం బెంగళూరులో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్తగా మరో కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అన్యాయం, అక్రమం, ఎవరికీ మంచిది కాదన్నారు. రాజకీయాలలో ఇలాంటి ధోరణలు మరింత ఇబ్బందులకు గురి చేసేలా చేస్తాయన్నారు. వేధింపులకు కూడా ఒక పరిమితి ఉంటుందన్నారు డీకే శివకుమార్.
వేధించాల్సిన అవసరం లేనే లేదన్నారు. అది సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఆస్తి కాదన్నారు. వారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నందున వారు వాటాలకు సంరక్షకులుగా ఉన్నారని చెప్పారు డీకే శివకుమార్. ఇది వారి వ్యక్తిగత ఆస్తి కాదు. వోహ్రాజీ, అహ్మద్ పటేల్ అందరి కాలంలో, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇది వారు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ హింస తప్ప మరోటి కాదన్నారు. . చరిత్ర పునరావృతం అవుతుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ పట్టించుకోడు, నేను మీకు చెప్తున్నాను. అతన్ని జైలులో పెట్టనివ్వండి. అతను ఎప్పటికీ దేనినీ పట్టించు కోడన్నారు.






