కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

Spread the love

బ‌లోపేతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు

గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని, అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు ఎన్.అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, మండల పార్టీ అధ్యక్షుల విధులు, బాధ్యతలపై మార్గదర్శనం చేశారు.

  • Related Posts

    పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

    Spread the love

    Spread the loveగ‌రిక‌పాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్ అమ‌రావ‌తి : మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో…

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

    Spread the love

    Spread the loveబీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కామెంట్స్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని అన్నారు. ఎమ్మెల్యే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *