రేపే టీటీడీ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

భ‌క్తుల ప్ర‌శ్న‌ల‌కు సింఘాల్ స‌మాధానం

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు సంబంధించి ప్ర‌తి నెలా నిర్వ‌హించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబర్ 5వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుందని స్ప‌ష్టం చేసింది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని పేర్కొంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని స్ప‌ష్టం చేసింది. ఇందుకు భక్తుల 0877-2263261లో సంప్ర‌దించాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా టీటీడీ గ‌త కొన్నేళ్లుగా ఈ అరుదైన డ‌య‌ల్ యువ‌ర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. భ‌క్తులు చెప్పే ప్ర‌తి మాట‌ను, ఇచ్చే సూచ‌న‌ల‌ను తీసుకునేందుకు డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

  • Related Posts

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *