హిందూ ధర్మ ప్రచార పరిషత్
తిరుపతి : భగవద్గీత ప్రతి ఒక్కరినీ కదిలించే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జయంతిని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలను ఎంపిక చేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆముదాల మురళి, కేటివి రాఘవన్, సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెడ్డిపిపి ఏఈవో సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.






