ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు
విశాఖపట్నం జిల్లా : ప్రముఖ భారతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ఆదివారం సందడి చేశారు. ఈ ఇద్దరు క్రికెటర్లు విశాఖ వాసులతో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశారు. అత్యంత ప్రసిద్దమైన పుణ్య క్షేత్రంగా పేరు పొందింది వివాఖ పట్నం జిల్లాలోని సింహాచంలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఇక్కడ దర్శించుకుని పూజలు చేస్తే కోరిన కోర్కెలు తప్పకుండా తీరుతాయని భక్తుల నమ్మకం, విశ్వాసం కూడా.
ఇదిలా ఉండగా స్వామి వారిని దర్శించు కునేందుకు విచ్చేసిన విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లకు ఘన స్వాగతం పలికారు సింహాచలయం ఆలయ కమిటీ పాలక మండలితో పాటు ఈవో, పూజారులు. స్వామి వారి సన్నిధిలో పూజలు చేశారు. వేద పండితులు, ఆచార్యులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయం తరపున స్వామి వారి చిత్ర పటంతో పాటు ప్రసాదాన్ని అందించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లడారు. ఈ ప్రదేశం అద్భుతంగా ఉందన్నాడు.






