స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : రాష్ట్రంలో నిరంతరం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు తీపికబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో జరిగిన వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పౌరసేవలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ శాఖకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కోసం కృషి చేయాలని సూచించారు.
గత ప్రభుత్వం పోలీసుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కానీ ఎప్పుడైతే కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువు తీరిందో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు. పోలీసులకు మౌలిక వసతులు కల్పించేందుకు సర్కార్ పూర్తిగా దృష్టి సారించిందని అన్నారు. ఎలాంటి వేధింపులు లేకుండా స్నేహ పూర్వకమైన వాతావారణంలో విధులు నిర్వహించేలా చేశామన్నారు వంగలపూడి అనిత.






