శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

Spread the love

తిరుప‌తిలో ఘ‌నంగా 137వ జ‌యంతి

తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్ర‌భుత్వ క‌ళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ | డా.గాలి గుణ‌శేఖ‌ర్ చెప్పారు. శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి 137వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంత‌రం సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 137వ జ‌యంతి సంద‌ర్భంగా తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళా మందిరంలో సాయంత్రం 6 గంట‌ల‌కు సాహితీ స‌ద‌స్సు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డా.గాలి గుణ‌శేఖ‌ర్ మాట్లాడారు. శ్రీమాన్‌ సుబ్రమణ్య శాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రాఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికి తీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. వీటిని 1931వ సంవత్సరంలోనే ఎపిగ్రాఫిక్స్‌ సిరీస్‌గా మద్రాసులోని తిరుపతి శ్రీ మహంతుల ప్రెస్‌లో ప్రచురించినట్టు చెప్పారు. దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా పురాతన వాస్తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్వామి వారి వైభవాన్ని మొట్ట మొదటిసారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శాస్త్రికి దక్కిందన్నారు.
త‌రువాత‌ సాధు గిరిజాదేవి మాట్లాడుతూ త‌న తండ్రి టిటిడికి చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ప్ర‌తి ఏటా ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఈ సందర్భంగా సాధు సుబ్రహ్మ‌ణ్య శాస్త్రి కుమార్తె గిరిజాదేవి, మనవడు, జడ్జి సిఎన్.మూర్తిన అన్న‌మాచార్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా.మేడ‌సాని మోహ‌న్‌ సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత, ఇతర అధికారులు, విశ్వసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్…

    అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : దేశంలో ఎక్క‌డా లేని విధంగా అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *