రేపే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక
ముంబై : భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది ఐసీసీ టి20 వరల్డ్ కప్. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా జట్లను ప్రకటించాయి. తాజాగా భారత జట్టును శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ , ప్రధాన కోచ్ గంభీర్ తో పాటు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ పాల్గొంటారు. ఇక గత కొంత కాలంగా కెప్టెన్ గా ఉన్న సూర్య భాయ్ , వైఎస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ లు దారుణంగా విఫలం అవుతూ వస్తున్నారు. అయినా గంభీర్, అగార్కర్ ఇద్దరూ జట్టులో కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి స్థానాలకు ఢోకా లేదని తేలి పోయింది.
ఇక గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ వ్యక్తిగత సంబంధాల ఆధారంగా కొంతమంది ఆటగాళ్ల జాబితాను తమ మనసులో పెట్టుకున్నారు. సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి పేర్లు ఇంకా ఖరారు కాలేదు. సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, అయితే శుభ్‌మన్ గిల్ స్థిరమైన ప్రదర్శన కనబరచక పోయినా, గాయాల పాలైనా జట్టులో కొనసాగుతున్నాడు. మొత్తంగా చూస్తే జట్టులో ఈ ఇద్దరి ప్లేస్ లు ఖరారైనట్టే.
భారత్ జట్టు లో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికె), అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ , సంజూ శాంసన్ , యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ద్ కృష్ణ ఉండే ఛాన్స్ ఉంది.







