అమృత ఫ‌డ్న‌వీస్ వ్య‌వ‌హారం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీతో సెల్ఫీ వైర‌ల్

ముంబై : వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ ప్ర‌స్తుతం భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలుత కోల్ క‌తాకు వెళ్లారు. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రాహుల్ గాంధీల‌తో క‌లిశారు. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా అభివాదం చేశారు. సీఎం టీంతో క‌లిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. ఇదే మైదానం వేదిక‌గా కీల‌క , ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు మెస్సీ. తాను ఎన్నో ప్రాంతాల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా తిరిగాన‌ని, కానీ హైద‌రాబాద్ లో ల‌భించినంత ప్రేమ‌, ఆప్యాయ‌త తాను ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. హైద‌రాబాద్ ను తాను జీవితంలో మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు మెస్సీ.

ఇదిలా ఉండ‌గా మహారాష్ట్ర స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సంద‌ర్బంగా మెస్సీ ని ఘ‌నంగా స‌న్మానించారు సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్. ఆయ‌న‌తో పాటు న‌టులు అజ‌య్ దేవ‌గ‌న్, టైగ‌ర్ ష్రాఫ్ ను కూడా స‌న్మానించ‌డం వివాదానికి దారి తీసేలా చేసింది. ఇదే స‌మ‌యంలో త‌ను సీఎం భార్య‌న‌న్న అహ‌కారంతో అమృత ఫ‌డ్న‌వీస్ ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండానే మెస్సీ వ‌ద్ద‌కు వెళ్లింది. చూయింగ్ గ‌మ్ న‌ములుతూ ఫోటో తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి. ఎంత సీఎం భార్య అయితే మాత్రం ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ నిప్పులు చెరుగుతున్నారు నెటిజ‌న్లు.

  • Related Posts

    భార‌త్ పురుషుల హాకీ జ‌ట్టుకు సీఎం కంగ్రాట్స్

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ భార‌త మెన్స్ హాకీ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షల అని శివకుమార్ అన్నారు. భారతదేశానికి స్వర్ణం సాధించిన భారత పురుషుల…

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *