చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్
హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయ విశ్వ విద్యాలయం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్బంగా ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్. కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్బంగా. వ్యక్తిగత హక్కులు మతపరమైన సనాతన ధర్మం, రాజకీయ ప్రయోజనం లేదా మూక సెంటిమెంట్‌కు గురవుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ నైతికత స్థిరమైన అన్వయింపు సిద్ధాంతం లేకపోవడం, గౌరవం షరతులతో కూడుకున్నదిగా మైనారిటీలు, మహిళలు , భిన్నాభిప్రాయ స్వరాలకు జీవితం అసురక్షితంగా మారే పరిస్థితులకు దారితీసిందని ఆయన అన్నారు.
జస్టిస్ బీఆర్ గవాయ్ నాయకత్వంలో అంబేద్కర్ చైర్ రాజ్యాంగ నీతికి జాతీయ కేంద్రంగా ఉద్భవిస్తుందని అన్నారు. న్యాయ పరమైన మనస్సాక్షిని, ధర్మ-ఆధారిత రాజ్యాంగ నైతికతను ఏకీకృతం చేస్తుందని సి ఎస్ రంగరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. చట్టం, నైతికత, సామాజిక సామరస్యాన్ని వారధిగా చేసుకుని, రాజ్యాంగ ఆలోచనలో భారతదేశం పాత్రను బలోపేతం చేసే విద్యా పరమైన చొరవకు మద్దతు ఇచ్చినందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు.






