స్వామిని దర్శించుకున్న ధరమ్ బీర్ గోకుల్
తిరుమల : తిరుమలకు విచ్చేశారు మారిషష్ అధ్యక్షుడు ధరమ్ బీర గోకుల్. ఆయనకు టీటీడీ తరపున సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రెసిడెంట్ దంపతులు మూల విరాట్టును దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు.
శ్రీవారి ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ తరఫున స్వాగతం పలికి ప్రెసిడెంట్ దంపతులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించి, శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా మారిషస్ ప్రెసిడెంట్ ధరమ్ బీర్ గోకుల్ మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో మరిచి పోలేని రోజు ఇది అని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించు కోవాలన్న కల ఉండేదని అన్నారు. ఇవాళ దర్శనం చేసుకోవడంతో ఆ కల పూర్తయిందని చెప్పారు. తనకు సాదర స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.








