newsseals.com
News

24న న‌గ‌రికి రానున్న చంద్ర‌బాబు నాయుడు

VijayaBhaskar January 23, 2026
newsseals--CMTour
Spread the love

భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌న్న ఎస్పీ

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 24న చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని న‌గ‌రిలో ప్ర‌త్యేకంగా నిర్వ‌హించ‌నున్నారు స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మం. ఇందులో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్ట‌ర్ కుమార్, ఎస్పీ తుషార్ డూడ్ ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. ఎక్క‌డా లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు జిల్లా క‌లెక్ట‌ర్. స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ట‌ణంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటార‌ని చెప్పారు క‌లెక్ట‌ర్. పెద్ద ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు.

అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యం చేసుకుని ఏర్పాట్లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీసులు ప్రతి స్థాయిలో సమన్వయంతో పని చేస్తూ అన్ని విభాగాలతో సమర్థవంతమైన ప్రణాళికను అమలు చేస్తున్నారని చెప్పారు ఎస్పీ. ముఖ్యంగా ఫైర్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పోలీస్ బందోబస్తు, డ్రోన్ మానిటరింగ్, విఐపి మూమెంట్స్ వంటి అంశాల్లో ఎటువంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ , ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ దేవదాస్, నగరి డి.ఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.