శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

Spread the love

1200 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌బ్జాదారులు, ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జా వాణి నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. న‌గ‌రంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ క‌డుతున్నారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని ఫ్రెండ్స్ కాల‌నీలో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. స‌ర్వే నంబ‌రు 1198లో 4.20 ఎక‌రాల ప‌రిధిలో ఫ్రెండ్స్ కాల‌నీ పేరిట 1987వ సంవ‌త్స‌రం లే ఔట్ వేశారు. ఇందులో 20 ఫీట్ల ర‌హ‌దారిని ఆక్ర‌మించి గోడ‌లు నిర్మించారు. గేటు కూడా ఏర్పాటు చేసి ప‌క్క‌నే ఉన్న ప్లాట్ల‌లోకి క‌లిపేశారు.

శామీర్‌పేట పోలీసు స్టేష‌న్ మీదుగా వెళ్లే దారి బందయ్యిందంటూ హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు అంద‌గా క్షేత్ర‌స్థాయిలో విచారించి రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ను హైడ్రా నిర్ధారించుకుంది. రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి కాల‌నీ వాసుల‌కు హైడ్రా దారి చూపింది. 15 ఏళ్లుగా తాము సంబంధిత శాఖ‌ల‌కు ఫిర్యాదు చేశామ‌ని బాధితులు తెలిపారు. ఇప్ప‌టికి హైడ్రా చొర‌వ‌తో త‌మ‌కు దారి దొరికింద‌ని స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలో ప్ర‌భుత్వానికి సంబంధించిన ఆస్తుల‌ను ఆక్ర‌మించుకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *