Saturday, 17 October 2026

కానిస్టేబుల్ జ‌యశాంతికి హోం మంత్రి ఆతిథ్యం

newsseals-AnithaVangalapudi

హోం మంత్రి కార్యాల‌యంలో ఆత్మీయ ప‌ల‌క‌రింపు

విజ‌యవాడ : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు కానిస్టేబుల్ జ‌య‌శాంతి. క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా అభినందించారు. ఇదిలా ఉండ‌గా జయశాంతికి రెండు రోజుల క్రితం ఫోన్ చేశారు అభినందించారు .హోంమంత్రిని కలవాలని కానిస్టేబుల్ జయశాంతి కోరింది. ఈరోజు విజయవాడలో హోంమంత్రి అనితను, కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతిను ప్రత్యేకంగా అభినందించారు.

కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేశారు హోం శాఖ మంత్రి అనిత. కానిస్టేబుల్ కుటుంబం యోగ క్షేమలను అడిగి తెలుసుకున్నారు ఈ సంద‌ర్భంగా. జయశాంతి, వారి కుటుంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉందన్నారు. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి త‌మ‌ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంలో పోలీసులు నిర్వ‌హిస్తున్న పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *