ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్త ముచ్చ‌ట : కేటీఆర్

Spread the love

తెలంగాణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన మంత్రి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాల‌యాప‌న చేయ‌డం త‌ప్పితే రాష్ట్రానికి చేసింది ఏముంది అంటూ ప్ర‌శ్నించారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న కేటీఆర్ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు సిట్ ముందు. దాదాపు 7 గంట‌ల‌కు పైగా త‌న‌ను విచారించారు. అన్నింటికి స‌మాధానాలు చెప్పిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది కేవ‌లం క‌క్ష సాధింపు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాల‌క తమ‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. అయినా తాము చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌న్నారు.

అందుకే రాత్రి నోటీసులు అందుకున్న వెంట‌నే తాను సిరిసిల్ల ప‌ర్య‌ట‌న ముగించుకుని నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వం అన్నాక త‌ప్ప‌నిస‌రిగా ఫోన్ ట్యాపింగ్ అనేది వృత్తిలో భాగంగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. దీనిని ప‌ట్టుకుని తాము ఏదో త‌ప్పు చేసిన‌ట్లు త‌మ‌కు అనుకూలంగా ఉన్న ప‌చ్చ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా వార్త‌లు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచిత్రం ఏమిటంటే విచార‌ణ లో ప్ర‌భాక‌ర్ రావు, రాధా కిష‌న్ రావులు ఉన్నార‌ని లీకులు ఇచ్చార‌ని, వాస్త‌వానికి ఒక్క తార‌క రామారావు త‌ప్ప ఏ రావూ లేడ‌న్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *