newsseals.com
News

పెట్టుబ‌డుల‌కు గ‌మ్య స్థానం హైద‌రాబాద్ న‌గ‌రం

VijayaBhaskar January 24, 2026
newsseals-KomatireddyVenkatreddy
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
హైటెక్స్‌లో ACE-TECH హైదరాబాద్ 2026ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే స్పష్టమైన “తెలంగాణ రైజింగ్ 2047” దార్శనికతతో ముందుకు సాగుతోంద‌ని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, 39 రేడియల్ రోడ్లతో రీజినల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయడం, ఐటీ, ఏఐ, ఫార్మా , నిర్మాణ రంగాలను ప్రోత్సహించడం, సమతుల్య పట్టణ గ్రామీణ వృద్ధిని నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్ ఒక ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా ఆవిర్భవిస్తూనే ఉంద‌ని చెప్పారు. అదే సమయంలో కాలుష్య రహిత భవిష్యత్తును నిర్మించడానికి సరసమైన గృహ నిర్మాణం, ఉపాధి కల్పన , సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంద‌ని చెప్పారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్యానెల్ చర్చ సందర్భంగా కాలుష్య రహిత నగరంపై అందిన సూచనలను క్యాబినెట్‌కు తీసుకెళ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్తులో హైద‌రాబాద్ దేశానికే ఓ రోల్ మోడ‌ల్ కానుంద‌ని జోష్యం చెప్పారు .