భార‌త్ యురోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య ఒప్పందం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం డాల‌ర్ డామినేట్ చేస్తున్న త‌రుణంలో, తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భార‌త్. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌రింత ఇక్క‌ట్ల‌కు గురి చేసేందుకు నిత్యం ప్ర‌య‌త్నం చేస్తూనే వ‌స్తున్నారు అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్. భారీ సుంకాల‌ను విధించాడు. దీంతో ఇండియ‌న్ మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఈ త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ మేర‌కు ఆయ‌న యురోపియ‌న్ యూనియ‌న్ తో జ‌త క‌ట్టారు. ఆ మేర‌కు ఢిల్లోలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో భార‌త దేశం త‌ర‌పున ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంత‌కాలు కూడా చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. భారతదేశం ,యూరప్ మధ్య విస్తృత ఆర్థిక సంబంధాలను చర్చించడానికి భారతదేశం-EU వ్యాపార వేదిక ఒక గొప్ప వేదిక అని అన్నారు. ఈరోజు సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వ్యాపారాలు, MSMEలు , ఆవిష్కర్తలకు లెక్కలేనన్ని ప్రయోజనాలను తెస్తుందంటూ ఆశా భావం వ్య‌క్తం చేశారు. ఇది భాగస్వామ్య శ్రేయస్సు కోసం ఒక కొత్త బ్లూప్రింట్ అని పేర్కొన్నారు పీఎం. 16వ ఇండియా-EU శిఖరాగ్ర సమావేశానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా , యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో కలిసి అధ్యక్షత వహించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *