టీటీడీ హృద‌యాల‌యానికి భారీ విరాళం

Spread the love

అభినందించిన జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్
తిరుప‌తి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం , విద్య) డా. ఎ. శరత్ కు అందజేశారు. ఇందులో భాగంగా 4 హై ఎండ్ వెంటిలేటర్లు , 4 హ్యూమిడిఫయర్లు , 4 హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ (హై ఫ్లో నాసల్ కేన్యులా పరికరాలు) ఉన్నాయి.

ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన చిల్డ్రన్స్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అల్కెమ్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి సాధించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధురిమ సింగ్ ను శాలువాతో సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, అల్కెమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    మే 01 నుండి శ్రీ వేద నారాయ‌ణ స్వామి బ్ర‌హ్మ‌త్స‌వాలు

    Spread the love

    Spread the loveఘ‌నంగా ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ…

    టీటీడీ ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

    Spread the love

    Spread the loveదానం చేసిన హైద‌రాబాద్ భ‌క్తుడు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమ‌ల లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి పెద్ద ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ కు చెందిన భ‌క్తుడు భారీ విరాళం అందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *