నారా లోకేష్ నీ పిల్ల చేష్ట‌ల‌కు భ‌య‌ప‌డ‌ను

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి ర‌మేష్

విజ‌య‌వాడ : మాజీ మంత్రి జోగి ర‌మేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ వైసీపీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డితే చూస్తూ ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న సీరియ‌స్ కామెంట్స్ చేశారు. లోకేష్‌ నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడనని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ద‌గుల్బాజీ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు జోగి రమేశ్.

నీ అయ్య, నువ్వు, నన్ను జైలులో పెట్టి రాక్షసానందం పొందింది చాలక నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేస్తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిగ్గు, శరం వదిలేసి సన్నాసుల్లాగ తయారయ్యారు.. ఏం పనులురా ఇవి, పనికి మాలినోడా అంటూ భ‌గ్గుమ‌న్నారు. నేను ఏం చేశానని మా ఇంటిపై దాడి చేశారంటూ ప్ర‌శ్నించారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమని లోకేష్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన రోజున పుట్ట‌గ‌తులు లేకుండా చేస్తామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *