ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

VijayaBhaskar · February 3, 2026
Spread the love

డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

అనంత‌పురం జిల్లా : ఉపాధి హామీ ప‌థ‌కం చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్రంలోని మోదీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి . మన్రేగా(MGNREGA) పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టానికి నేటితో 20 ఏళ్లు నిండాయ‌న్నారు. ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి, దివంగ‌త‌ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం వద్ద ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. ఆనాడు స్టార్ట్ చేసినందుకు గుర్తుగా శిలాఫలకాన్ని సందర్శించి ఇదే బండ్లపల్లి గ్రామం నుంచి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు ష‌ర్మిలా రెడ్డి.

దేశంలోనే తొలి జాబ్ కార్డు అందుకున్న బండ్లపల్లి గ్రామస్థురాలు చీమల పెద్దక్కను కలిసి ఉపాధి హామీ పథకం తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కో్లాది మందికి ఉపాధి క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కం ఇప్పుడు నిర్వీర్య‌మై పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తక్ష‌ణ‌మే ఉపాధి హామీ ప‌థ‌కం చ‌ట్టాన్ని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని, కోట్లాది మంది కూలీల‌కు ప‌ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ష‌ర్మిలా రెడ్డి.