కేంద్ర స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల

VijayaBhaskar · February 7, 2026
Spread the love

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాలి

అమ‌రావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. యుపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం వ‌ల్ల కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు , కార్మికుల‌కు మేలు జ‌రిగింద‌న్నారు. కానీ ఆ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త‌గా చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింద‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని ష‌ర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఏపీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ష‌ర్మిలా రెడ్డి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట (MGNREGA) పరిరక్షణ యాత్రకు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టికే అనంత‌పురం , శ్రీ స‌త్య సాయి, అన్న‌మ‌య్య జిల్లాల్లో పూర్త‌యింది.

యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలో సాగింది. గంగవరం మండలం నల్లగుట్ల పల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు అంతా పాల్గొని మన్రేగా పథకం ఉండాలని, పేదల పొట్టగొట్టే VB G RAM G చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు 2006 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం పలమనేరు నియోజక వర్గ పల్లెల్లో పేద కుటుంబాలకు ఆసరా అయ్యిందని అన్నారు . తమ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, వలసలు తగ్గాయని గ్రామస్థులు గుర్తు చేశారు.