జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

VijayaBhaskar · February 9, 2026
Spread the love

గుంటూరుకు తీసుకు వెళ్లిన పోలీసులు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీ నేత‌లు దాడి చేయ‌డం, ఇంటిని , ఆఫీసును ధ్వంసం చేయ‌డం, కారు, ఫ‌ర్నీచ‌ర్ కు నిప్పంటించ‌డం విదిత‌మే. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌పై ప‌లు చోట్ల కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జైలులో ఉన్న అంబ‌టి రాంబాబుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ ప‌ద్ద‌తిని అప్ప‌గించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో త‌న‌పై కేసు న‌మ‌దు చేశారు పోలీసులు. నిన్న పోలీసులు పిటీ వారెంట్ జారీ చేశారు.

ఇదే సమ‌యంలో ఉన్న‌ట్టుండి జైలులో ఉన్న త‌న‌కు షాక్ త‌గిలింది. సోమ‌వారం జారీ చేసిన పిటీ వారెంట్ కు సంబంధించి పోలీసులు రాజ‌మండ్రి జైలు వ‌ద్ద‌కు వ‌చ్చారు. పిటీ వారెంట్ ఉండ‌డంతో జైలు సూప‌రింటెండెంట్ తో అనుమ‌తి తీసుకుని గుంటూరుకు త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా గతేడాది నవంబర్‌ 12 వైసీపీ ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేష‌న్ లో అంబటి రాంబాబుపై కేసు న‌మోదు కావ‌డం విశేషం. కాగా అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.