న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

Spread the love

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం

న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం లేదు. త‌ను గ‌త కొన్ని రోజులుగా తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ ప‌డుతున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎవ‌రిని ఓపెన‌ర్ గా తీసుకోవాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన కేర‌ళ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తీవ్ర నిరాశ ప‌రిచాడు. త‌ను కేవ‌లం 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దీంతో అనూహ్యంగా తెర‌పైకి ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు. త‌ను ప్ర‌స్తుతం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు.

ఈ త‌రుణంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని గంభీర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక స‌కాలంలో కోలుకుంటే అభిషేక్ శ‌ర్మ‌ను ఆడిస్తామ‌ని లేక పోతే సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు సూత్ర ప్రాయంగా వెల్ల‌డించాడు బ్యాటింగ్ కోచ్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ మైదానంలో సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ తో క‌లిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నమీబియాతో జరిగే మ్యాచ్ కు ముందు అభిషేక్ శ‌ర్మ‌కు జ్వరం లక్షణాలు తగ్గకపోతే, పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అతను పూర్తిగా ఫిట్ గా ఉండేలా టీం ఇండియా త‌న‌ స్థానంలో సంజు సామ్సన్ ను తీసుకోవచ్చు.

  • Related Posts

    ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో…

    యూట‌ర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

    Spread the love

    Spread the loveఫిబ్ర‌వ‌రి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైద‌రాబాద్ : క్రికెట్ అభిమానుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *