నంది వాహనం కైలాసనాథుడి ద‌ర్శ‌నం

Spread the love

శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మ‌హా విష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.
ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ సోమ‌వారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు.

ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వ దర్శనం కోసం బారులు తీరిన భ‌క్తుల‌ను ఆల‌య నిర్వాహ‌కులు, పూజారులు అనుమ‌తి ఇచ్చారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో జేఏఓ వి. వీర‌బ్ర‌హ్మం సార‌థ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇదిలా ఉండ‌గా వాహ‌న సేవ‌లో టీటీడీ సివిఎస్వో కే.వి.ముర‌ళికృష్ణ‌, ఆలయ ప్ర‌త్యేకాధికారి డి.ఫ‌ణి కుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు విశేష‌ సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి

    Spread the love

    Spread the loveభ‌క్తుల‌ను అనుగ్ర‌హించిన స్వామి తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ కపిలేశ్వర ఆల‌యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తొమ్మిదో రోజైన సోమ‌వారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై…

    ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందింద‌ని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *