పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి : సీఎం

VijayaBhaskar · February 18, 2026
Spread the love

పుర‌పాలిక పాల‌న‌పై రేవంత్ రెడ్డి సమీక్ష‌

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు . ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ నగ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ను మూడు కార్పొరేష‌న్లుగా విభజించారు. ఇప్ప‌టికే కొత్త‌గా క‌మిష‌న‌ర్ల‌ను కూడా నియ‌మించారు. మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యల పై దిశానిర్ధేశం చేశారు సీఎం. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాల పై అధికారులకు పలు సూచనలు చేశారు

మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని… పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు సీఎం. త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే
అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్ప‌ష్టం చేశారు.