ఐబీఎంతో ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం

ల‌క్ష మంది ప్ర‌తిభావంతుల‌కు శిక్ష‌ణ

న్యూఢిల్లీ : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం న్యూఢిల్లీలో జ‌రుగుతున్న ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఏపీకి చెందిన ప్ర‌తిభావంతులైన వారికి కీల‌క అంశాల‌పై శిక్ష‌ణ ఇచ్చేలా చూడాల‌ని కోరారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన సూచ‌న‌ల‌కు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్యం కల్పించడానికి తాము IBMతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో త‌మ అభ్యాసకులు పరిశ్రమకు అనుగుణంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక శ్రామిక శక్తిని బలోపేతం చేస్తారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో IBM EMEA , గ్రోత్ మార్కెట్స్ SVP , , చైర్ అనా పౌలా, IBM ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, IBM రీసెర్చ్ ఇండియా., CTO డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ , ప్రభుత్వం , నియంత్రణ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీతో ఈరోజు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *