మంత్రి నారా లోకేష్ పై పేర్ని నాని కామెంట్స్
అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై. ప్రజల డబ్బులను నీళ్ల లాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుబారా చేస్తున్నారని అన్నారు. వీరికి తోడు సనాతన ధర్మం పేరుతో జనాన్ని బురిడీ కొట్టించడమే కాకుండా పవర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలను కూడా ఏకి పారేశారు పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా శ్రీలంకలో జరిగే క్రికెట్ మ్యాచ్ చూసేందుకు నారా లోకేష్ వెళ్లడం దారుణమన్నారు. మొత్తంగా ఎక్కుడు దిగుడు తప్పా ఏపీకి వీళ్లు చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అక్రమంగా ఈవీఎంలను మ్యానేజ్ చేసిన విషయం బయట పడిందన్నారు. దీనిని తప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారంటూ ధ్వజమెత్తారు పేర్ని నాని. స్పెషల్ ఫ్లైట్ దుడ్డు మీ అబ్బా అకౌంట్ నుంచి కొన్నారా అని ప్రశ్నించారు. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మీ దుడ్డుతో ఎన్ని స్పెషల్ ఫ్లైట్ల టికెట్లు కొన్నారో ట్వీట్ చేసే దమ్ము ఉందా అని నిలదీశారు మాజీ మంత్రి.






