నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

Spread the love

చిన్న‌ప్ప‌టి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి

హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైద‌రాబాద్ రాక‌తో త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని ప్ర‌సంగించారు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చ‌చ్చేంత ఇష్టం అని చెప్పారు. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్, అరుంధతి
వంటి అత్యనున్నత సాంకేతిక తో కూడిన సినిమాలు వచ్చాయని ప్ర‌శంసించారు సీఎం. చెన్నై లో ఉన్న సినిమా ను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ కు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇదే క్రమంలో నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే ఇక హాలీవుడ్ వచ్చినట్లేన‌ని అన్నారు.

మా దృష్టి హాలివుడ్ పైననే అని నేను గతం లోనే చెప్పానని అన్నారు రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణ కు మా పూర్తి సహకారం ఉంటుందని ప్ర‌క‌టించారు. ఫోర్త్ సిటీ ని నిర్మిస్తున్నాం .
మీ విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీ లో ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నామ‌ని హామీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీ కి తీసుకు రావాలని కోరారు. ప్రపంచం లో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ లో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు సీఎం.

  • Related Posts

    స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

    Spread the love

    Spread the loveపాట‌ల ర‌చ‌యిత మాట‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్. ఆయ‌న తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్…

    అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

    Spread the love

    Spread the loveఇప్ప‌టికే ఫిర్యాదు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాలో వేధింపుల ప‌ర్వం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ప్ర‌త్యేకించి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *