Friday, 16 October 2026

రేపే పుష్ప యాగానికి అంకురార్ప‌ణ

newsseals-PushpaYagam

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాలక మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి లోని ప్ర‌సిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి 14న శ‌నివారం అంకురార్పణ
చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అంతే కాకుండా 15న ఆదివారం తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 523వ వర్థంతి మహోత్సవం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాన వనాలకు చేరుకుంటార‌ని తెలిపింది.. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠి గానం నిర్వహించనున్నార‌ని టీటీడీ పేర్కొంది. అటు తరువాత స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారని తెలిపింది. ఇదిలా ఉండ‌గా పుష్ప యాగం సంద‌ర్బంగా టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింద‌ని , ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా విస్తృతంగా వ‌స‌తి సౌక‌ర్యాలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *