Friday, 16 October 2026

దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చ‌ర్య‌లు

newsseals-TTD

టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడిన‌ట్లు తెలిపింది టీటీడీ. దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడ‌ని పేర్కొంది.

ఇందుకు గాను టీటీడీకి, శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడని వెల్ల‌డించింది. ఇదిలా ఉండగా నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు వ‌స్తుంటార‌ని తెలిపింది. భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉండాల‌ని సూచించింది. ఇందులో భాగంగా టీటీడీ సిబ్బందికి సహకరించాలని శ్రీ‌వారి భ‌క్తుల‌ను కోరింది. తిరుమ‌ల కొండ‌పై శ్రీ‌వారి నామ స్మ‌ర‌ణ త‌ప్ప వేరే స్మ‌ర‌ణ ఉండ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *