ఘ‌నంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య వ‌ర్దంతి

Spread the love

ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం

తిరుపతి : శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి అభిషేకం జరిగింది. అభిషేకంలో భాగంగా అన్నమయ్య విగ్రహానికి జలంతో శుద్ధి గావించి పాలు, పెరుగు, తేనె, పంచదార, టెంకాయ, నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చక వేద మంత్రోత్సవాల నడుమ అభిషేకం నిర్వ‌హించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి పట్టు వస్త్రాలు, పుష్పమాలతో అలంకరించి ధూప దీప నివేదన కర్పూర హారతి అన్నమయ్య భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో నగర సంకీర్తనలో పాల్గొని గోష్టి గానం నిర్వహించారు. ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం చేప‌ట్టారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు హరికథ గానం చేప‌ట్టారు.

  • Related Posts

    శ్రీ‌ధ‌ర్ బాబుకు శార‌దా పీఠం ఉత్త‌రాధికారి ఆహ్వానం

    Spread the love

    Spread the loveరావాల‌ని కోరిన ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శ‌నివారం మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోనికోకాపేట…

    శ్రీ తిరుమలనాధ స్వామికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

    Spread the love

    Spread the loveటీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌ యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. ఉత్స‌వాల‌లో భాగంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *