దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు

Spread the love

మాజీ మంత్రి సీరియ‌స్ కామెంట్స్ వైర‌ల్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . త‌ను గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్. వారు స్వ‌యంగా జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేర‌కు జీవ‌న్ రెడ్డిని క‌లిశారు. త‌న‌కు పార్టీలో అత్యంత ముఖ్య‌మైన ప‌ద‌విని ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంద‌ని తెలిపారు. ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంద‌ని, త‌న సేవ‌లు పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా జీవ‌న్ రెడ్డి మంత్రులు త‌న‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. దేవుడు శాసిస్తాడు జీవ‌న్ రెడ్డి పాటిస్తాడ‌ని, త‌న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. కొంద‌రు గ‌త కొంత‌కాలంగా త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చార‌ని, ఇక ఆత్మ గౌర‌వం చంపుకుని పార్టీలో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అందుకే త‌ను కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు. దీన్ని బట్టి మంత్రుల చర్చలు విఫలమైనట్లుగా అందరూ అభిప్రాయ పడుతున్నారు.. పార్టీని వీడే విషయంలో జీవన్ రెడ్డి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేలిపోయింది.

  • Related Posts

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    Spread the love

    Spread the loveహైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం…

    త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    Spread the love

    Spread the loveబీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *