త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

Spread the love

బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌న ప్లాన్ ఉంటుంద‌న్నారు. అవమానాలు, అణిచివేతల నుంచే పెను మార్పులు వస్తాయని చెప్పారు ఎంపీ.
పదవుల కోసం పెదవులు మూసే రకం తాను కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఈట‌ల రాజేంద‌ర్. మీ ఆశీర్వాదాలు వృథా కాకుండా చేస్తానన‌ని పేర్కొన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు. త‌న జీవితం ఉన్నంత వ‌ర‌కు జ‌నంలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. ఆ రోజుల్లో నాతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపెడేవాళ్లని అన్నారు. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుందన్నారు. తాను ఎవ‌రి ప‌ట్ల ద్వేష పూరితంగా ఉండ‌న‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌క్ష సంక్షేమం కోసం తాను పాటు ప‌డ‌తాన‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    Spread the love

    Spread the loveహైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం…

    దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు

    Spread the love

    Spread the loveమాజీ మంత్రి సీరియ‌స్ కామెంట్స్ వైర‌ల్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . త‌ను గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *