వైఎస్ జ‌గ‌న్ కుట్ర‌లు ఇక చెల్ల‌వు : ఎంపీ

త‌ల్లిని గౌర‌వించ లేని వ్య‌క్తికి అంత సీన్ లేదు

మంగ‌ళ‌గిరి : టీడీపీ ఎంపీ అప్ప‌ల నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న నిర్వాకం కార‌ణంగా ఏపీ రాష్ట్రం అన్ని రంగాల‌లో 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆరోపించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో. చరిత్రలో రాక్షసులు కూడా దేవుళ్లను కొలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ, జగన్ కు అటు దైవభక్తి లేదు.. ఇటు మాతృభక్తి లేదన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి ల‌డ్డూను అప‌విత్రం చేయ‌డంలో త‌ను కీల‌క పాత్ర పోషించార‌ని ఆరోపించారు ఎంపీ అప్ప‌ల నాయుడు. గత ఐదేళ్లు హిందూ ధర్మాన్ని నాశనం చేసిన జగన్, ఇప్పుడు స్వామి వారి ప్రసాదం విషయంలో కూడా తన పేటీఎం బ్యాచ్ ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తుంటే.. పరిశ్రమలు రాకూడదు, భావితరాలకు ఉపాధి లభించ కూడదు అనే కుట్రతో జగన్ విషప్రచారం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం బాగుపడినా ఆయనకు నచ్చదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పడం చాలా చిన్న మాట. కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహ లేని ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులను సమాజం నుంచి సంఘ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *