గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది కాబట్టే కీలకమైన పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నారు. గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల‌న్నారు.

వ్యవసాయ పంపు సెట్లకు పీఎం కుసుమ్ పథకం వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాల‌ని ఆదేశించారు సీఎం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో దక్షిణ భారత దేశంలో ఏపీనే ముందు వరుసలో ఉందన్నారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని అన్నారు సీఎం. వీటితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం వంటి వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Related Posts

    సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన…

    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ హైద‌రాబాద్ : ప్రోటోకాల్ ను పాటించ‌డం లేద‌ని, ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *