ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

Spread the love

ఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు

నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు ఉత్సాహ భరితంగా కొనసాగాయి. హృదయాన్ని హత్తుకునేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రి అనితకు శుభాకాంక్షలు తెలుపేందుకు వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, అధికారులు, ఉద్యోగులు, యువకులు, సంఘాల ప్రతినిధులు భారీగా తరలి వచ్చారు.

మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొని, వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరై, మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా అనిత మాట్లాడుతూ త‌న‌ను ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం సేవ చేస్తాన‌ని అన్నారు.

  • Related Posts

    సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన…

    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ హైద‌రాబాద్ : ప్రోటోకాల్ ను పాటించ‌డం లేద‌ని, ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *