ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గత తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించి, గరుడ పటాన్ని అవతరింపజేశారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సమస్త పాప విముక్తులై, ధన ధాన్య సమృద్ధితో తుల తూగుతారని ఐతిహ్యం. అలాగే విషమృత్యు నాశనం కలిగి, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని ప్రగా విశ్వాసం. తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజూ భక్తులు వివిధ ప్రాంతాల విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం పట్ల భక్త జన బాంధవులు టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.







