బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హైద‌రాబాద్ : రాష్ట్ర‌, రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు.
త‌మ‌ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు జిత్నా అబాది ఉత్నే ఇసెదరి అని చెప్పినట్టు కుల గణన చేశాం అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన వర్గాల పక్షపాతి అని స్ప‌ష్టం చేశారు. మా పార్టీలో బలహీన వర్గాల మంత్రులైన‌ కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, నేను కలిసి మాకు రావాల్సిన వాట పై సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు.

తాము ఈడ‌బ్ల్యుఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డు కోలేద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు బలహీన వర్గాల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవద్దని కోరారు. బీసీ సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామ‌ని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. బీసీ సంక్షేమ శాఖ లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని వెల్ల‌డించారు. గతంలో విదేశీ విద్య 300 మందికి ఇచ్చేదని, కానీ తాము వ‌చ్చాక‌ దానిని 700 కి పెంచుకున్నాం అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం అని తెలిపారు.
కుల సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం ఈ సంవత్సరం అమలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *