ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక తను అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాడని అన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వాపోయారు. రాచరిక పాలన కొనసాగుతోందని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రధాన నగరాలలో ప్రభుత్వ ఆస్తులపై కొందరు కన్నేశారని వాపోయారు. ఇక ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు తెర లేపారని మండిపడ్డారు. అయినా తాము అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. 15 కోట్లకు ఒక ఎకరం అంటే 200 ఎకరాలకు సంబంధించి 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని దళారులకు కట్టబెడుతున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేరళ నుండి దళారులు వచ్చి లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా ఉందన్నారు హరీశ్ రావు.
ఈ భూమిని ఇచ్చి, దిల్( డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూమిలో మార్కెట్ కట్టుకోండి అంటున్నారని అన్నారు. ఆ దిల్ భూములపై ఏపీ ప్రభుత్వం కేసు వేసిందన్నారు. ఆ భూములు ఇప్పట్లో వచ్చేది లేదు మార్కెట్ కట్టేది లేదన్నారు.





