ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే పనులు ఆపే ప్రసక్తి లేదన్నారు సీఎం. పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 200 కోట్లతో బోథ్ నియోజకవర్గం అడేగామాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, రూ. 45 కోట్లతో బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రూ. 20 కోట్లతో శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి , సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 20 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) భవనాన్ని, రూ 13 కోట్లతో సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు సీఎం. రూ 15 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి ,రూ 30 కోట్లతో బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం, డిప్యూటీ సీఎంలు. రూ 20 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనాన్ని ప్రారంభించారు.
రూ 30 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వివిధ రకాల అభివృద్ధి పనులకు, రూ 8.99 కోట్లతో బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ లలో (3) 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ 50.70 కోట్లతో బోథ్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి, రూ 44.64 కోట్లతో బోథ్ నియోజకవర్గంలో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి, రూ 65.85 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకానికి శంకుస్థాపన చేశారు.
రూ 6.435 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణానికి
రూ 31.52 కోట్లతో ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి
రూ 11.76 కోట్లతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన చేశారు.





