రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వ‌చ్చింది

VijayaBhaskar · April 8, 2026
Spread the love

ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి నిప్పులు చెరిగారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత రాత‌లు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై. సిగ్గు, శ‌రం ఉన్న ఏ వ్య‌క్తి కూడా ఇలాంటి రాత‌లు రాయ‌ర‌ని మండిప‌డ్డారు. సోయి లేకుండా ఇష్టానుసారంగా మ‌హిళ‌లు అన్న క‌నీస గౌర‌వం, ఇంగిత జ్ఞానం లేకుండా అడ్డ‌గోలుగా ఏది ప‌డితే అది రాసుకుంటూ పోతే ఎలా అని సీరియ‌స్ అయ్యారు.

ఒక‌నాడు సైకిల్ పై తిరిగిన రాధాకృష్ణా ఎంత‌మందిని మోసం చేస్తే , ఎన్ని సూట్ కేసులు మార్చితే ఈ స్థాయికి వ‌చ్చావో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. త‌క్ష‌ణ‌మే రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. నీ పాపం పండే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని, ఆరోజున నిన్ను ఎవ‌రూ కాపాడ లేర‌న్నారు. అందుకే వైయస్‌ఆర్‌సీపీ మహిళల్ని ఆడి పోసుకుంటున్నావని నిప్పులు చెరిగారు. నీ కుటుంబం గురించి కూడా ఒకసారి నీ పత్రికలో రాయి.. అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్‌వి అవుతావు అని అన్నారు. నీ తప్పుడు రాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల‌ని. అప్పటి వరకు నిన్ను వదిలి పెట్ట‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు.