క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

VijayaBhaskar · April 14, 2026
Spread the love

అమ‌రావ‌తిలో ఇవాళ ప్రారంభించిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీ సీఎం ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.

నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌పంచంలో మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా మ‌నం కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేక‌పోతే వెనుక‌బ‌డి పోతామ‌ని పేర్కొన్నారు. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక పెద్ద ఎత్తున ఐటీ, లాజిస్టిక్ కంపెనీలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ గూగుల్ డేటా సెంట‌ర్ విశాఖ‌లో కొలువు తీరింద‌న్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో మ‌రికొన్ని ఏర్పాటు కాబోతున్నాయ‌ని వెల్ల‌డించారు.