డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

మ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ

బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ ప్ర‌త్యర్థి జ‌ట్ల‌ను బోల్తా కొట్టిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్సీబీ 5 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక్క రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో మాత్ర‌మే ఓట‌మి పాలైంది. ఇక మిగ‌తా నాలుగు మ్యాచ్ ల‌లో విజ‌య ఢంకా మోగించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కేవ‌లం 15.1 ఓవ‌ర్ల‌లోనే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని సాధించింది. ఇక ఆర్సీబీ బౌల‌ర్లు ప్ర‌తాపం చూప‌గా ఆర్సీబీ బ్యాట‌ర్లు మ‌రోసారి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్స్ తో 49 ర‌న్స్ చేశాడు. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో హాఫ్ సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. ఇక కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ 27 ప‌రుగులు చేయ‌గా జితేష్ శ‌ర్మ 23 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించారు. ల‌క్నో త‌ర‌పున ప్రిన్స్ యాద‌వ్ 32 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్ల తీస్తే ఆవేష్ ఖాన్ 23 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. జ‌ట్టు గెలుపులో కీ రోల్ పోషించిన హాజిల్ వుడ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *