జీవ‌న్ రెడ్డితో కేటీఆర్, హ‌రీశ్ రావు భేటీ

20న జ‌రిగే కేసీఆర్ స‌భ‌పై విస్తృత చ‌ర్చ‌లు

జ‌గిత్యాల జిల్లా : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బాస్ , మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు ఈనెల 20న జ‌గిత్యాల జిల్లాకు రానున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి అధికారికంగా కేసీఆర్ స‌మ‌క్షంలో ప్ర‌జ‌ల సాక్షిగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌పై సీనియ‌ర్ నాయ‌కులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌భను స‌క్సెస్ చేసేందుకు బావ బావ‌మ‌ర్దులు కేటీఆర్, త‌న్నీరు హ‌రీశ్ రావులు శ‌నివారం జ‌గిత్యాల‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారు నేరుగా జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌తో సుదీర్ఘంగా స‌మాలోచ‌న‌లు జ‌రిపారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే జీవ‌న్ రెడ్డి త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా ఆయ‌న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇద్ద‌రూ క‌లిసి భోజ‌నం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి చ‌ర్చించారు. ఒక‌రినొక‌రు శాలువాలు క‌ప్పుకున్నారు. తామిద్ద‌రి మ‌ధ్య 40 ఏళ్ల రాజ‌కీయ , వ్య‌క్తిగ‌త అనుబంధం ఉంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు జీవ‌న్ రెడ్డి. కాగా చాలా మంది త‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వెళతార‌ని భావించారు . కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *