Saturday, 17 October 2026

మోదీ ద‌త్త పుత్రుడు జ‌గ‌న్ తెర తొలగింది

newsseal-YSShaarmila

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.
నిన్న‌టి బిల్లుతో పీఎం మోదీ ద‌త్త పుత్రుడు జ‌గ‌న్ బండారం ఏమిటో బ‌య‌ట ప‌డింది. వాస్త‌వం ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలిసింద‌న్నారు. శ‌నివారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. బిల్లు వీగి పోవ‌డం ప్ర‌జాస్వామ్య విజ‌యంగా అభివ‌ర్ణించారు. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేట తెల్లమైందని అన్నారు.
విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. TDP, జనసేనల కంటే మోడీ గారిని ఇంతలా మోయాలా? అని ప్ర‌శ్నించారు.

మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ? అని నిల‌దీశారు. అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు YCP అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి సిగ్గు పడాలని అన్నారు ష‌ర్మిలా రెడ్డి. మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా ? మోదీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? అని ఫైర్ అయ్యారు. ఇదేనా మీరు చెప్పే YSR ఆశయాలు, వారసత్వం ? అని భ‌గ్గుమ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *