మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్
సంగారెడ్డి జిల్లా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటన లో బాగంగా చౌటకూర్ మండలం శివంపేట్ లోని జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూలాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ రూ.43 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజీలో డి ఎం ఎఫ్.టి 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన High Mast LED 4 స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం, 26 లక్షల రూపాయలతో తోషిబా కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీ కి ఇప్పటి వరకు 2 కోట్ల 35 లక్షల 75 వేల రూపాయల సీఎస్ఆర్ నిధులను వెచ్చించి పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ అభివృద్ధిపై కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి, ఇతర విభాగాల వర్క్ షెడ్ ల నిర్మాణానికి ప్రయత్నిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ పాండు, సర్పంచ్ సంధ్యారాణి, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డివి రెడ్డి, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






