Saturday, 17 October 2026

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా అనిల్ చంద్ర

newsseals-AnilChaandraPunetha

బాధ్య‌త‌లు స్వీక‌రించిన విశ్రాంత అధికారి

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చంద్ర పునేఠా .విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున వెల్ల‌డించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలానికి నియమితులైనట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా అనిల్ చంద్ర పునేఠా క‌ర్ణాట‌క కేడ‌ర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో వివిధ హోదాల‌లో ప‌ని చేశారు అనిల్ చంద్ర పునేఠా. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎంగా చంద్ర‌బాబు నాయుడు ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. చంద్ర‌బాబుకు న‌మ్మ‌క‌మైన ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత తిరిగి రెండో సారి ఏపీకి సీఎంగా ఎన్నిక కావ‌డంతో త‌న‌కు పూర్తిగా విధేయుడిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాకు కీల‌క‌మైన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పోస్టు అప్ప‌గించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *