వైసీపీ మనుగడ మొత్తం విధ్వంస‌మే

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థ‌సార‌థి

అమ‌రావ‌తి : వైసీపీ పాల‌నా కాలంలో మొత్తం విధ్వంసం త‌ప్ప జ‌రిగింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా అని నిల‌దీశారు. ఏపీ రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అధః పాతాళానికి తొక్కేసిందని ఆరోపించారు. వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసం భయాందోళనలు, హత్యల మీదనే సాగుతోందన్నారు. రాత్రికి రాత్రే చంపేయటం.. తెల్లవారేసరికి మొసలి కన్నీరు కార్చడం వైసీపీ నేతల నైజం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న 60కి పైగా డాక్యుమెంట్లు దస్తగిరి వద్ద ఎందుకున్నాయి? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొలుసు పార్థసార‌థి.

వాడుకొని వదిలేయడం, అవసరమైతే ‘ఎలిమినేట్’ చేయడం వైసీపీ విధానం అన్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రతిష్ఠను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు మంత్రి. అధికారం, ఆస్తి కోసం వైసీపీ నేతలు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ మనుగడ మొత్తం విద్వంసం, భయాందోళనలు, హత్యలు అనే మూడు రెక్కల మీద సాగింద‌ని మంత్రి విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నుంచి నేటి దస్తగిరి హత్య వరకు ఆ పార్టీ అనుసరిస్తున్న పనితీరు ఒకేలా ఉందని ఆయన ఆరోపించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *