రాష్ట్రాభివృద్దికి సింగ‌పూర్ సాంకేతిక సాయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

సింగ‌పూర్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగ‌పూర్ దేశం అనుస‌రిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మత్స్య శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో క‌లిసి అచ్చెన్నాయుడు సింగ‌పూర్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా సింగపూర్‌లో నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో సమావేశం అయ్యారు.

భారత్ – సింగపూర్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక శక్తి, టెక్నాలజీ రంగాల్లో సింగపూర్ నైపుణ్యాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా వినియోగించు కోవాలనే అంశాలపై సానుకూల చర్చలు జరిగాయని వెల్ల‌డించారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో అంతర్జాతీయ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *